Site icon Bhakthi TV

తిరుమల దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? టికెట్స్ దొరకని వారు ఇలా ట్రై చేయండి..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? గదులు దొరకడం లేదు.. దర్శన టికెట్స్ దొరకడం లేదన్న చింత వద్దు. ఏపీ పర్యాటక శాఖ దీనికోసం ఏర్పాట్లు చేసింది. తక్కువ ధరలో శ్రీవారి దర్శనం చక్కగా చేసుకుని వచ్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఏసీ స్లీపర్ బస్సు.. వసతి, భోజనాలు, దర్శనం వంటివాటన్నింటినీ పర్యాటకశాఖ చూసుకుంటుంది. రెండు రోజుల పాటు ఈ టూర్ ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజీని ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్‌ నుంచి ఏసీ స్లీపర్ బస్సు బయలుదేరుతుంది. తెల్లవారుజామున 6 గంటలకు తిరుమల చేరుతుంది.

కొండపై వారికి వసతి, టిఫిన్ వంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఆపై 10 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తారు. దర్శనం అవగానే భోజనం అందిస్తారు. ఆ తరువాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం.. అనంతరం రాత్రి 7 గంటలకు డిన్నర్‌ ఉంటుంది. ఇక ఆ తరువాత రాత్రికి తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ వస్తుంది. ఇక ఈ ప్యాకేజ్ కోసం పెద్దలకు రూ. 3,970, పిల్లలకు రూ.3,670గా నిర్ణయించారు. ఇక తిరుమలకు వెళ్లాలనుకునేవారు.. 9848007025, 9440251775, 0866-2571393 నెంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఏపీటీడీసీ తెలిపింది.

Share this post with your friends
Exit mobile version