Site icon Bhakthi TV

నందీశ్వరుడిని కోరిక ఏదైనా కోరనున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

శివుని ఆలయంలోకి వెళ్లామంటే ముందుగా మనకు నందీశ్వరుడే దర్శనమిస్తాడు. ఏ ఆలయంలోని వెళ్లినా కూడా తప్పక శివునికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. మన కోరిక ఏదైనా నందీశ్వరుడికి చెబితే అది తప్పక శివుడిని చేరుతుందని నమ్మకం. అందుకే ఆలయంలోకి వెళ్లగానే ముందుగా నందికి మొక్కుతాం. మన కోరికను నందీశ్వరుడి చెవిలో చెబుతాం. అయితే మన కోరికను నందికి చెప్పేందుకు కూడా నియమాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా శివపార్వతులను పూజించుకుని అనంతరం నంది దగ్గరకు రావాలి. నందికి నీటితో పాటు పువ్వులు, పాలు సమర్పించారు.

నందీశ్వరుడికి ఫలానా చెవిలో అంటే కుడివైపు లేదంటే ఎడమవైపు చెవిలోనే చెప్పాలన్న నియమమంటూ ఏమీ లేదు. కానీ ఎడమ చెవిలోచెబితే మాత్రం ఫలితం కాస్త ఎక్కువగా ఉంటుందని అంటారు. అయితే నంది చెవిలో కోరికను చెప్పడానికి ముందు ఓం పదాన్ని ఉచ్ఛరించాల్సి ఉంటుందట. ఇది ఉచ్ఛరిస్తే త్వరగా మన కోరిక శివుడిని చేరుతుందట. మన కోరికను నందికి చక్కగా స్పష్టంగా చెప్పాలి. పైగా వేరొకరికి మీ కోరిక తెలియనివ్వకూడదు. ఒకరి గురించి చెడుగా కాకుండా మీ గురించి మంచిగా కోరుకోండి. ఒకే సమయంలో ఒక కోరికను మాత్రమే చెప్పాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version