Site icon Bhakthi TV

నీళ్లు, పానకం తాగిన వారాహి అమ్మవారు..

భగవంతుని విగ్రహాలు కొన్ని పాలు తాగుతుండటం చూస్తుంటాం. అయితే వారాహి అమ్మవారు ఒకచోట నీళ్లు, మరోచోట పాలు తాగుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరులో మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. పీలేరులోని బ్రాహ్మణ వీధిలో వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుమారస్వామి అనే పూజారి సైతం తన ఇంట వారాహి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను నిర్వమిస్తున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహిస్తుండగా పాలు తాగిందట. దీనిని కొందరు భక్తులు వీడియో తీయగా ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది.

పూజా సమయంలో పూజారి అమ్మవారి విగ్రహం ముందు పానకాన్ని ఉంచగా అమ్మవారు స్వీకరించింది. విషయాన్ని గమనించిన పూజారి భార్య అందరికీ చెప్పడంతో దానిని భక్తులు వీడియో తీశారు. ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వింతను చూసేందుకు పూజారి ఇంటికి జనం క్యూ కట్టారు. అలాగే విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించగా అక్కడ అమ్మవారు నీటిని తాగేసింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు విషయాన్ని బయటకు చెప్పడంతో క్షణాల్లో ఆ ప్రాంతమంతా పాకిపోయింది. ఇలా అమ్మవారు పాలు, నీళ్లు తాగడం ఆమె మహిమేనని అంటున్నారు.

Share this post with your friends
Exit mobile version