Site icon Bhakthi TV

గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడిన ఇంద్రుడు

గురుడుడు అమృతం కోసం దేవతలందరితో రేయింబవళ్లు యుద్ధం చేశాడు. ఆ తరువాత ఆగ్రహంతో స్వర్గాన్ని చీకటి మయం చేసి.. తన రెక్కలతో దుమారం రేపాడు. అప్పుడు యముడు ఒక్కడు మాత్రం అందరినీ ఓడించి అమృతం కోసం గరుడుడుని సమీపించాడు. అప్పుడు గరుడుడు పరిగెత్తగా విష్ణువు అతడిని ఆపి తన వాహనానికి జెండాగా ఉండాలంటూ వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక , అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే.. వారు జయించలేని వారవుతారు. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా , తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు.

‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి , నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి , పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి , అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version