Site icon Bhakthi TV

గీతా జయంతి నాడు తులసి పూజ చాలా ముఖ్యం..

గీతాజయంతిని హిందువులంతా పెద్ద ఎత్తున ప్రతి ఏడాది జరుపుకుంటారు. ఈ రోజున కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతను ఉపదేశించాడు. ఈ గీతలో జీవితానికి సంబంధించిన విషయాలు, కర్మ, మతం, మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని కన్నయ్య బోధించాడని చెబుతారు. కర్మయోగం ప్రకారం మనిషి తన పనిని తాను నిస్వార్థంగా చేస్తూ పోతే మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. గీత అధ్యయనం మనిషిని భగవంతునిలో అనుసంధానించే మార్గాన్ని సూచిస్తుందట. మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున గీత పుట్టిందని చెబుతారు. పంచాంగం ప్రకారం గీతా జయంతిని మనం ప్రతి సంవత్సరం ఈ రోజునే గీతాజయంతిని జరుపుకుంటాం.

గీతా జయంతిని డిసెంబర్ 11న మనం జరుపుకోనున్నాం. మరి గీతా జయంతి రోజున మనం ఏం చేయాలో తెలుసుకుందాం. గీతా జయంతి రోజున శ్రీమద్భగవద్గీత పఠిస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ రోజున శ్రీకృష్ణుని నియమ నిష్టలతో పూజించాలి. ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. పీటను సిద్ధం చేసుకుని కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి, ధూపం, పువ్వులు సమర్పించాలి. ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. దానధర్మాలు సైతం సత్ఫలితాలను ఇస్తుంది. తులసి పూజ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అలాగే ఈ రోజున శివపార్వతులను సైతం పూజిస్తే చాలా మంచిదని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version