Site icon Bhakthi TV

టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 21కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణ దాన ట్రస్ట్‌కు భారీ విరాళాన్ని భక్తులు అందజేశారు. ఏకంగా రూ.21 కోట్ల విరాళాన్ని ఓ సంస్థ ప్రతినిధి అందజేశారు. పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన శ్రీ రాజిందర్ గుప్తా ఆదివారం టీటీడీకి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రాజిందర్ గుప్తా చెక్కును టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ సి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలోఅందజేశారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక తిరుమల ఇవాళ కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు అయితే 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తుులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 86,604 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇక ఎల్లుండి శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ క్రమంలోనే ఎల్లుండి శ్రీవారి ఆలయంలో పలు సేవలను టీటీడీ రద్దు చేసింది.

Share this post with your friends
Exit mobile version