Site icon Bhakthi TV

వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. అవి నమ్మి చాలా మంది మోసపోతున్నారు. విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయమై కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా నిజం కాదని స్పష్టం చేసింది. వాస్తవం ఏమిటంటే.. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డాయి. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

Share this post with your friends
Exit mobile version