Site icon Bhakthi TV

వరలక్ష్మీ వ్రతం క‌ర‌ప‌త్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్రతం జ‌రుగ‌నుంద‌న్నారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. మరోవైపు తిరుమలకు బైక్‌పై వెళ్లే భక్తుల భద్రత దృష్టా టీటీడీ ఆంక్షలు విధించింది. ఆగస్ట్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. ఈ నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేసింది. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే అవి తరచుగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Share this post with your friends
Exit mobile version