Site icon Bhakthi TV

శ్రీనివాస కళ్యాణోత్సవం ధర్మ రథాలను ప్రారంభించిన టీటీడీ ఈవో

అమరావతిలోని వేంకట పాలెంలో మార్చి 15వ తేదీన సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లను నిర్వహిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. ఈ కల్యాణానికి ఏపీ సీఎం చంద్రబాబు సైతం హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే కల్యాణోత్సవానికి సంబంధించి చుట్టు పక్కల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనుంది.

ఈ క్రమంలోనే శ్రీవారి ధర్మ రథాలను శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె శ్యామల రావు జెండాను ఊపి ప్రారంభించారు. వేంకట పాలెంలో జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం శ్రీవారి ధర్మ రథాలను ప్రారంభించారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో ధర్మ రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, జిల్లా కలెక్టర్ సర్వశ్రీ నాగలక్ష్మీ, టీటీడీ జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సీఈ శ్రీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version