Site icon Bhakthi TV

విడుదల కానుంది!! రేపు గురుపౌర్ణమి.. వేద వ్యాసుడి గురించి కొన్ని విషయాలు..

రేపు గురు పౌర్ణమి. ఈ సందర్బంగా వేద వ్యాసుడిని స్మరించుకుంటారు. గురు పౌర్ణమి సందర్భంగా వేద వ్యాసుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక రాశిగా ఉన్న వేదాలను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను ఋగ్, యజ్, సామ, అథర్వణమని నాలుగు విభాగాలు చేశారు. ఆ నాలుగింటిని సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ధతంరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు.

ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తిచేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ధ తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు. మంత్రాన్ని దర్శించివాడు అని ఋషి అను పదానికి అర్థం కూడా (రిషయోః మంత్రద్రష్టారః) ఉంది. ఎలాగైతే అర్జునుడు పరమాత్మ విశ్వరూపాన్ని దర్శించాడో, అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి. అటువంటి వేదములను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి. వేదానికి స్వరం ముఖ్యం.

Share this post with your friends
Exit mobile version