
మానవాళి క్షేమం కోసం భగీరధుడి తపస్సుకి మెచ్చి దివి నుంచి భువికి గంగమ్మ ఏతెంచింది. అలా గంగమ్మ భూమిపై అడుగు పెట్టిన రోజును మనం గంగా దసరాగా జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది అది ఎప్పుడో కాదు.. ఈ నెల 16న అంటే రేపే. అయితే రేపటి గంగా దసరాకు ఒక ప్రత్యేకత ఉంది. 100 ఏళ్ల అరుదైన ఘటన రేపటి రోజున జరగనుంది. అదేంటంటే హస్తా నక్షత్రంలో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం అనే శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన రేపు చేసే నదీ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. అలాగే రేపు దానాలు చేసినా అద్భుతమైన ఫలితం ఉంటుందట. అలాగే మనం చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందట.
ఇక రేపు ఏర్పడే శుభ యోగాల కొన్ని రాశులపై అంటే మేష రాశి, మిధున రాశి, కుంభం వంటి రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయట. వీరు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు పొందుతారు. ఇక పంచాంగం ప్రకారం గంగా దసరా రోజున గంగా స్నానం లేదా నదీ స్నానంతో పాటు పూజ, దానాలకు శుభ సమయం వచ్చేసి 16న ఉదయం 4:03 నుంచి 4:43 వరకు ఉంటుంది. అలాగే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:50 వరకూ.. సంధ్యా ముహూర్తానికి సాయంత్రం 7:20 నుంచి 7:40 వరకూ అనుకూల సమయం. ఈ సమయాల్లో గంగానదిని పూజించడం, నదీ స్నానం చేయడం వల్ల మోక్షం కలుగుతుందని నమ్మకం.
