Site icon Bhakthi TV

ఇవాళ టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల

తిరుమల శ్రీవారి దర్శనాలు, విడిదికి సంబంధించిన కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్‌లు, పథకాలతో పాటు శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించి దర్శనాలు, వసతి గదుల 2025 జనవరి నెల కోటాను ( వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తారీఖులు మినహాయించి ) ఇవాళ (అక్టోబరు 24) ఉదయం 11.30 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. కాబట్టి భక్తులు ఆన్‌లైన్‌లో భక్తులు వసతి, దర్శనాలకు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కేవలం ఆరు గంటల్లో పూర్తవుతోంది. అదే విధంగా దాతలకు సంబంధించిన కోటాను నేడు అందుబాటులో ఉంచనుంది. తిరుమలలో స్వామివారిని బుధవారం 64,359 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 20,711 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ. 3.59 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

Share this post with your friends
Exit mobile version