Site icon Bhakthi TV

ఇవాళ వైష్ణవ యోగిని ఏకాదశి.. ఈ ఒక్కరోజు ఉపవాసముంటే..

ఇవాళ దేశమంతా యోగిని ఏకాదశిని జరుపుకుంటోంది. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని మనం యోగిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయట. పైగా ఈ ఒక్కరోజు ఉపవాసముండి.. విష్ణుమూర్తిని పూజిస్తే 88 వేల మంది బ్రహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం లభించడంతో పాటు జనన, మరణ చక్రాల నుంచి విముక్తి లభిస్తుందట. శరీరం, మనస్సు, ఆత్మలను శుద్ధి చేస్తుందట.

అంతే కాకుండా ఈరోజున చేసే ఉపవాసం కారణంగా ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందట. అయితే ఉపవాసం ఉండేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని కూడా ముట్టరు. అలా పూర్తి స్థాయిల ఉపవాసం ఉండలేని వారు మాత్రం పండ్లు, పాలు తీసుకుంటారు. బియ్యంతో చేసిన ఏ ఆహార పదార్థాన్ని తినకూడదు. సబ్బు లేకుండా స్నానం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే తులసి ఆకులను తీయకూడదు. సూర్యోదయానికి ముందు ఉపవాసం విరమిస్తారు. అలాగే ద్వాదశి తిథి ప్రారంభంలో హరి వాసర సమయంలో పారాయణ చేయరు.

Share this post with your friends
Exit mobile version