Site icon Bhakthi TV

ఇవాళ కల్కి జయంతి.. శత్రు బాధల నుంచి ఉపశమనం లభించాలంటే..

హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుద్ధ షష్టి రోజు కల్కి జయంతిని జరుపుకుంటాం ఉంటాం. ఈ ప్రకారం ఈ ఏడాది కల్కి జయంతి ఇవాళే. ఈ రోజున కల్కి అవతారాన్ని పూజిస్తే శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణం ప్రకారం సత్య యుగంలోని సంధి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని పున: స్థాపింపజేయడానికి కల్కి అవతరిస్తాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొర్దాబాద్ సమీపంలోని సంభాల్ గ్రామంలో కల్కి భగవానుడు జన్మించాడని, ఆయన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉన్నారని అక్కడి వారంతా చెబుతున్నారు.

కలియుగంలో విష్ణు భక్తుడైన కల్కి తండ్రికి వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి. ఇక కల్కికి లక్ష్మీ రూపమైన పద్మ, శక్తి రూపమైన వైష్ణవి అనే ఇద్దరు భార్యలున్నారు. శ్రీరాముడిని వివాహం చేసుకోవాలని వైష్ణవి త్రేతా యుడగం నుంచి వైష్ణోదేవిగా తపస్సు చేస్తోంది. అయితే కల్కి ఈమెను కలియుగంలో వివాహం చేసుకుంటాడు. కల్కి తన వాహనమైన శ్వేతాశ్వంపై స్వారీ చేస్తూ పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇవాళ కల్కి జయంతి కాబట్టి కల్కి అవతారమైన విష్ణుమూర్తిని పూజించాలి. ఇలా పూజిస్తే శత్రు బాధల నుంచి ఉపశమనం లభిస్తుందట.

Share this post with your friends
Exit mobile version