Site icon Bhakthi TV

16న శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు ఈ విషయం తెలుసుకోండి..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు భక్తులు ప్రస్తుతం తిరుమలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 15వ తేది మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌.

భారీ వర్ష సూచన నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలనీ, ఘాట్ రోడ్డులలో జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకుని సమాయత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Share this post with your friends
Exit mobile version