Site icon Bhakthi TV

దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మను ఈ 32 నామాలతో పూజించండి..

హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి ప్రముఖ స్థానం పొందింది…భారతీయ దైవత్వాలలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి దుష్ట శిక్షణ చేసి.. తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం. చెడుపై మంచి చేసే యుద్దానికి ప్రతీకగా భావిస్తారు.అందుకనే ఎవరైనా శత్రువుల వలన పీడిం,బడుతున్నా.. భయం కలుగుతున్నా, కష్టాల్లో ఉన్నవారు.. దుర్గమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇక కష్టనష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవిని 32 నామాలతో .. స్తోత్రం చేస్తే పడిపోతున్న వారికి చేయందించి అమ్మవారు పైకి లాగుతుంది..

అంతటి శక్తికల 32 నామాలు ఏమిటంటే..

దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ
దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత
దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని
దుర్గమోహ, దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ
దుర్గమాంగీ, దుర్గమత,
దుర్గమ్య, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా,
దుర్లభా, దుర్గధారిణీ

Share this post with your friends
Exit mobile version