
నైనిటాల్‌లోని పాషన్ దేవి ఆలయం గురించి మనం తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంది. మరి ఇక్కడ ఉన్న అమ్మవారిని పాషన్ దేవిగా ఎందుకు పిలుస్తారంటారా? దీనికి ఒక కారణముంది. ఇక్కడ దుర్గాదేవి విగ్రహం ఇక్కడ సహజంగా ఏర్పడిందట. పాషన్ దేవి విగ్రహం ఒక రాతిపై ఉంటుంది. రాతిపై ఉన్న ఆకారం దేవత రూపంలో ఉంటుంది. సహజమైన రాతితో ఏర్పడింది కాబట్టి అమ్మవారిని పాషన్ దేవి అంటారు. పాషాణం అంటే రాయి. ఈ ఆలయంలో ఒక్క అమ్మవారి విగ్రహం మాత్రమే కాకుండా మొత్తం ఆలయం రాళ్లతో నిర్మించబడింది.
ఈ పాషన్ దేవి ఆలయంలోని నీరు అద్భుతమని ముందే చెప్పుకున్నాం కదా.. ఈ నీటిని అద్భుతంగానూ, పవిత్రంగా పరిగణిస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలో ఉండే నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని ప్రజలు విశ్వసిస్తారు. భక్తులు ఇక్కడకు వెళ్లి నీటిని తాగడం లేదా స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయట. ముఖ్యంగా ఎవరికైనా చర్మ సంభదిత వ్యాధులుంటే అవన్నీ నయమవుతాయని భక్తులు చెబుతారు. ఈ నీటికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతారు. అంతేకాదు.. ఎవరికైనా నత్తి ఉన్నా కూడా ఈ నీరు తాగితే అది పోతుందట. ముఖ్యంగా నవరాత్రులలో ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
