Site icon Bhakthi TV

తెలంగాణలోని ఈ గ్రామంలో 400కు పైగా ఆలయాలు

తెలంగాణలోని ఒక గ్రామంలో వందల కొద్దీ దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ గ్రామం తెలంగాణలో ఎక్కడుందో తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9 కిలో మీటర్ల దూరంలో ఈ నగునూర్ అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 400 పైగా ఆలయాలున్నాయి. గతంలో నన్నూరుగా పిలిచే ఈ గ్రామం.. ప్రస్తుతం నగునూర్‌గా పిలవబడుతోంది. ఈ గ్రామంలో రెండు ఎత్తైన కొండలు ఉండటంతో శత్రువుల రాకను పసిగట్టే వీలుండటంతో.. కాకతీయులు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పాలించేవారు. కాకతీయులు పరమ శివభక్తులు. దీంతో శివుడి ఆలయాలతో పాటు నంది గ్రహాలను ఇక్కడ ప్రతిష్టాంచారు.

ఈ నగునూరు ఇప్పటికీ కాకతీయుల ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామంలో ఎక్కడ దేని కోసం తవ్వినా కూడా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పురాతన వస్తువు కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల కూడా ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాల చేయగా పురాతనమైన నంది విగ్రహం బయటపడింది. అయితే దీన్ని తవ్వి తీసేందుకు యత్నించగా.. అది మాత్రం బయటకు రాలేదు. దీంతో విగ్రహాన్ని పగులగొట్టారు. నిధులు లభ్యమవుతాయేమోనని.. తమ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గ్రామస్తులు తవ్వకాలు జరుపుతున్నారు. స్థానికులు కొందరు అధికారులకు సమాచారం ఇచ్చారు.

Share this post with your friends
Exit mobile version