Site icon Bhakthi TV

ఈ గుడికి పూజారి కానీ.. హోమ్ గార్డ్స్ కానీ ఉండరు..

దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం రెండూ మనుషుల్లో చిన్ననాటి నుంచే ఉంటాయి. అయితే భయం చుట్టూ అల్లుకున్న కథలకు ఆధారాలు అయితే ఉండవు. కాకన్‌మఠ్ ఆలయం మిస్టరీ కూడా అలాంటిదేనని చెప్పాలి. ఎన్నో మిస్టరీలకు నిలయమైన ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. కకాన్‌మఠ్ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. మధ్యప్రదేశ్‌లోని మురైనాలో ఈ ఆలయం ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. గ్వాలియర్‌ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడమిది. సిమెంట్ కానీ.. సున్నం కానీ వాడకుండా దీనిని నిర్మించారు.

అయినా సరే ఈ ఆలయం కొన్ని శతాబ్దాల పాటు ఈ కట్టడం చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్‌ మెటీరియల్‌ వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ ఆలయాన్ని దెయ్యాలు 11వ శతాబ్దంలో నిర్మించారట. ఈ ఆలయం 115 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయని చెబుతారు కాబట్టి ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి కానీ.. హోమ్ గార్డ్స్ కానీ ఉండరు. గుడికి కాస్త దూరంలో ఉండి రాత్రి సమయంలో గుడి వైపు ఎవరూ వెళ్లకుండా కాపలా కాస్తుంటారు.

Share this post with your friends
Exit mobile version