
హిందువులు యముడి గురించి ఎంతలా మాట్లాడుకుంటారో చిత్ర గుప్తుడి గురించి అంతే మాట్లాడుకుంటారు. ఎందుకంటే మంచి చెడులను అంచనా వేసి చిట్టా రాసే బాధ్యత చిత్రగుప్తుడిదేనని చెబుతారు. మన మంచి, చెడుల ఆధారంగానే చనిపోయాక స్వర్గమా.. నరకమా? అనేది కన్ఫర్మ్ అవుతుందట. అయితే చిత్రగుప్తుడికి ఆలయాలు లేవా? అంటే ఒకటో రెండో ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ చిత్రగుప్తుడికి ఒక ప్రత్యేక ఆలయం ఉంది. దీని తరువాత తేని జిల్లాలోని కోడంగి పట్టిలోనూ ఓ ఆలయం ఉంది.
కోడంగి పట్టి ఆలయం తేని నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే.. మధురై-కొచ్చి జాతీయ రహదారిపై బోడినాయకనూర్ వెళ్ళే మార్గంలో ఉంది. ఈ ఆలయం వెరీ స్పెషల్. అలాగే రోజంతా తెరచి ఉండదు. ఉదయం కొన్ని గంటలు, అలాగే సాయంత్రం రెండు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం తెరిచే ఉండే వేళలేంటంటే.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ.. ఈ సమయాల్లో మాత్రమే చిత్రగుప్తుడిని భక్తులు దర్శించుకోగలరు.
