Site icon Bhakthi TV

మారేడు దళాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే..

మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవడం వలన లాభాలు.. అలాగే ఏ దిక్కున పెంచుకుంటే మంచి జరుగుతుంది? మారేడు దళాలను ఏ రోజున కోయాలి వంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బిల్వ పత్రాలను ఏ రోజుల్లో కోయకూడదో కూడా తెలుసుకున్నాం. సోమ, మంగళ, శుక్రవారాలతో పాటు ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున పొరపాటున కూడా మారేడు దళాలను కోయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు పిరియడ్స్ సమయంలో మారేడు దళాలను కోయకూడదు. సూర్యుడు రాశి సంక్రమణం చేసే రోజున.. అలాగే అమావాస్య, పౌర్ణమి, చతుర్ధశి, అష్టమి, చవితి ఈ ఐదు తిథులు ఉన్న రోజుల్లోనూ మారేడు దళాలు కోయడం మంచిది కాదంటున్నారు.

మారేడు దళాన్ని ఒకసారి శివుడికి అర్పించిన మీదట తిరిగి దానిని మరునాడు వినియోగించవచ్చట. అలా ఒకరోజే కాదు. మొత్తంగా 30 రోజుల పాటు వినియోగించవచ్చట. స్తోమత ఉన్న వారు వెండి, బంగారంతో మారేడు దళం ఆకారాన్ని తయారు చేయించుకుని సైతం పరమేశ్వరుడికి నిత్య పూజ చేయవచ్చట. వేరే ఇతర ఆకులు కింద పడితే పూజకు పనికిరావు కానీ మారేడు దళాలను మాత్రం కిందపడినా తీసి కడిగి వినియోగించవచ్చట. శివుడిని మారేడు దళాలతో పూజించే సమయంలో కొబ్బరి నీళ్లలో ముంచి తీసి పూజిస్తే ఫలితం మరింత అద్భుతంగా ఉంటుందట. పై నియమాలన్నింటినీ పాటిస్తూ మారేడు చెట్టును ఇంట పెంచుకుంటే అన్ని విధాలుగా ఆ ఇంట్లోని వారికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version