Site icon Bhakthi TV

శ్రావణమాసంలో వాయినం ఇచ్చేవారు చేయకూడని పనులివే..

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో వ్రతం చేసుకుంటారని తెలిసిందే. అయితే వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మరి నిబంధనలేంటో తెలుసుకుందాం. వాయనం ఇచ్చేవారు పొరపాటున కూడా మాంసాహారం కానీ ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. శ్రావణ మాసం శరీరానికి నూనె కూడా రాసుకోరు. ఇలా రాసుకోవడం అశుభమని చెబుతారు. నూనెను అయితే ఒంటికి రాసుకోరు కానీ దానం చేయవచ్చు. ఇలా చేస్తే మంచి జరుగుతుంది.

ఇక శ్రావణమాసంలో పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదట. అలాగే పురుషులు అయితే కటింగ్ చేయించుకోవడం లేదంటే గడ్డం కత్తిరించుకోవడం వంటివి చేయకూడదట. రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించకూడదు.
తులసి ఆకులను శివుడి పూజలో అస్సలు ఉపయోగించకూడదు. శివుడికి మారేడు దళాలు అత్యంత ఇష్టమైనవి కాబట్టి వాటితోనే పూజ చేయాలి. వ్రతం ఆచరించేవారు పూజకు ముందు కానీ తరువాత కానీ భాగస్వామికి దూరంగా ఉండాలి. వాయినం ఇచ్చే సమయంలో ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి. వాయినం ఇచ్చే వస్తువులు శుభ్రంగా, పవిత్రంగా ఉంచాలి.

Share this post with your friends
Exit mobile version