Site icon Bhakthi TV

రాజకుటుంబం ఇక్కడ పూజలు నిర్వహిస్తే చనిపోతారట..

నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివపురి కొండ మధ్యలో ఉన్న బుధ నీలకంఠ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో ఒక విషయమైతే మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అదేంటంటే.. ఈ ఆలయానికి ఎవరైనా వెళ్లవచ్చు. సామాన్యుల నుంచి ఒక్క నేపాల్ రాజకుటుంబం మినహా ఎవరైనా ఇక్కడ పూజలు నిర్వహించవచ్చు. రాజ కుటుంబం ఎందుకు పూజలు ఇక్కడ నిర్వహించకూడదంటే.. ఈ ఆలయం రాజ కుటుంబానికి శాపగ్రస్తమైందని చెబుతారు. శాప భయంతో రాజకుటుంబం బుధనీలకంఠ ఆలయాన్ని సందర్శించదు.

ఎందుకంటే.. ఈ ఆలయంలో కొలువైన విష్ణుమూర్తిని రాజకుటుంబానికి చెందిన ఎవరైనా సందర్శిస్తే.. పూజలు చేసిన వారు చనిపోతారట. దీనికి కారణం రాజకుటుంబానికి ఉన్న శాపమేనని చెబుతారు. ఈ కారణంగా రాజకుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు పూజలు చేయరు సరికదా.. అసలు ఈ ఆలయాన్నే సందర్శించరు. అయితే రాజకుటుంబం పూజించుకోవడానికి అచ్చం ఆలయంలోని విష్ణుమూర్తిని పోలిన మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధనీలకంఠ ఆలయంలో విష్ణువు నీటి కొలనులో 11 తలల శేషు నాగుపై నిద్రిస్తున్న భంగిమలో ఒకే రాతిపై చెక్కారు. పాల సముద్రంలో విష్ణువు శయనించి ఉన్నట్టే విగ్రహం ఉండగా.. ఆదిశేషువు 11 తలలతో పాన్పునూ.. విష్ణుమూర్తి 4 చేతుల్లో సుదర్శన చక్రం, శంఖం, తామరపువ్వు, గద ఉంటాయి.

Share this post with your friends
Exit mobile version