శ్రీ నరసింహ స్వామికి శనివారం పూజ ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. పానకం అంటే ఎంతో ప్రీతి. ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునే వారు శనివారం పూజలో వడపప్పు, పానకం తప్పనిసరిగా నివేదించాలి. ఆ పైన మీ శక్తి కొద్దీ ప్రసాదాలను నివేదించవచ్చు. నైవేద్యం సమర్పించిన అనంతరం చివరగా స్వామివారికి కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి. అనంతరం స్వామికి నివేదించిన వడపప్పు, పానకం, ప్రసాదాలను ఇంటిల్లిపాది స్వీకరించాలి.
ఇలా నియమానుసారం 11 శనివారాల పాటు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని పూజిస్తే ఏదైనా కారణాల వల్ల అనుకోకుండా ఆగిపోయిన శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇది శ్రీలక్ష్మి నరసింహస్వామి సత్యమని తెలిపే నిదర్శనంగా కూడా చెబుతారు. అయితే ఈ పూజ నిర్వహిస్తున్న సమయంలో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మీకు దగ్గరలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి వెళితే మంచి జరుగుతుందట. అలాగే ఎవరికైతే శుభం జరగాలని కోరుకుంటున్నారో వారి పేరిట పూజ చేయిస్తే మంచిదని చెబుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దాదాపుగా ఎక్కడైనా కొండపైనే కొలువుంటాడు కాబట్టి నడిచి వెళితే మరీ మంచిదట.
