
పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన వాటిలో నాలుగు నగరాలను శ్రీరాముని తనయులైన లవ, కుశలు…. భరతుని కుమారులైన తక్షుడు, పుష్కరుడు కట్టించారట. అప్పట్లో ఈ నగరాలు పేర్లు కూడా కట్టించిన వారి పేరు మీదుగానే ఉండేవట, కాలక్రమేణా…. వాటి పేర్లలో మార్పులు సంభవించాయట, మార్పులొచ్చినప్పటికీ వాటి పేర్లు ఒరిజినల్ పేర్లకు దగ్గరగా ఉండడం విశేషం. ఆ నగరాలేంటో తెలుసుకుందాం.
ఖాసూర్ : దీని అసలు పేరు కుశపురం…. దీనిని శ్రీరాముడి పెద్ద కుమారుడు కుశుడు కట్టించాడు. అతని పేరు మీదుగానే ఈ నగరానికి కుశపురం వచ్చింది. ఈ తరువాతి కాలంలో కుశపురం కాస్త ఖాసూర్‌గా మారిపోయింది.
లాహోర్: దీని అసలు పేరు లవపురం. దీనిని శ్రీరాముడి చిన్న కుమారుడు లవుడు కట్టించాడు. అతని పేరు మీదుగానే ఈ నగరానికి లవపురం వచ్చింది. ఆ తరువాతి కాలంలో లవపురం కాస్త… లాహోర్ గా రూపాంతరం చెందింది.
తక్షశిల : దీనిని శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించాడు.
పెషావర్ : దీని అసలు పేరు పుష్కలావతి / పురుషపురం… దీనిని శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించాడు. కాలక్రమేణా పురుషపురం కాస్త పెషావర్‌గా మారిపోయింది.
