Site icon Bhakthi TV

పూరి జగన్నాథుని ఆలయంలో రహస్య గది.. అందులో అపార సంపద ఉందట..

పూరి జగన్నాథ ఆలయం కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ఆలయంలో ని మూడవ రత్న భాండాగారాన్ని తెరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం అడుగున ఒక రహస్య గది ఉందని.. దీనిలో అపార సంపద ఉందట. ఈ రహస్య గదిలోకి వెళ్లేందుకు ఒక సొరంగ మార్గం కూడా ఉందని దీనిని గుర్తించాలని చరిత్రకారులు సూచిస్తున్నారు. ఈ సొరంగ మార్గాన్ని కనిపిట్టేందుకు అప్పట్లో బ్రిటీష్ వారు సైతం యత్నించారని కానీ వారి వల్ల కాలేదని అంటున్నారు. జగన్నాథుడికి ఈ సంపదను పూరీని పాలించిన రాజు కపిలేంద్రదేవ్‌ సమర్పించారట.

అప్పట్లో కపిలేంద్రదేవ్ తూర్పు, దక్షిణ రాజ్యాలపై విజయం సాధించడంతో స్వామివారికి అపార సంపదను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఈ రమస్య గదిలో వెలకట్టలేనంత సంపద ఉందని అంటున్నారు. 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి దేవికి సంబంధించిన వడ్డాణాలు, సుభద్రాదేవి ఆభరణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు వంటివెన్నో ఉన్నాయనేది చరిత్రకారుల వాదన. ఉత్కళ సామ్రాజ్యంపై అప్పట్లో ముస్లింలు అనేకమార్లు దండయాత్ర చేసి ఆలయాలను దోచుకున్నారన్నారు. ఈ క్రమంలోనే అప్పటి రాజులు స్వామివారి సంపదను కాపాడేందుకుక రహస్య గదిని నిర్మించి సంపద మొత్తాన్ని దానిలో భద్రపరిచినట్టు సమాచారం.

Share this post with your friends
Exit mobile version