Site icon Bhakthi TV

మహాభారతంలో జరిగిన వినయ, ధర్మయుద్ధాలివే..

మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో భీష్ముడు ఒకరు. సింహాసనం పదిలంగా ఉండాలని, రాజ్యం కలకాలం నిలవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ణ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ణ కేవలం మాటలు కాదు..అది తనలోని కోరికలకు,ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిర నిరంతర యుద్ధం. ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే. నిజమైన యోధులు యుద్ధరంగంలోనే పోరాడరని..కొన్నిసార్లు తమ అంతరంగంలోనూ యుద్ధం చేస్తారని భీష్ముడి పాత్ర తెలియజేస్తుంది. తన న్యాయమైన కోరికలను, తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు..ఇది కురుసామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది.

ధర్మ యుద్ధం..

పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతారు. దీంతో ఆమెను జట్టు పట్టుకొని సభకు ఈడ్చకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు. ద్రౌపది చాలా అవమానానికి గురవుతుంది. అయితే అప్పుడు ద్రౌపది ఎదురుతిరిగి పోరాడలేదు. సభలో ఉన్న పెద్దలను,రాజులను తన పదునైన మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది. తన మాటలనే ఆయుధాలుగా వాడింది. ఆమె ప్రశ్నించిన తీరు,ఆమె చూపిన ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టాడు. అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షే చివరికి కురక్ష్రేతంలో ధర్మం కోసం జరిగే మహా సంగ్రామానికి అగ్గి రాజేసింది. ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురు వంశాన్నే దహించేసే మహాజ్వాలగా అయింది. ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మపోరాటం చరిత్రలో నిలిచిపోయింది.

Share this post with your friends
Exit mobile version