Site icon Bhakthi TV

కృష్ణాంగారక చతుర్దశికి సంబంధించిన కథేంటంటే..

బహుళ పక్షం.. కుజుడికి సంబంధించిన మంగళవారం.. చతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజు అన్నీ కలిసి వచ్చిన రోజును మనం కృష్ణాంగారక చతుర్దశిగా జరుపుకుంటాం. దీనికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతీ నగరంలో ఉండేవాడు భరద్వాజ మహర్షి, ఒకప్పుడు ఆ భరద్వాజుడు అప్సరసను చూడడంవల్ల ఆయనకి ఒక విధమైనటువంటి మోహము కలిగింది. దీంతో ఆయనకు వీర్య పతనం అయింది. అది కాస్తా భూమి మీద పడటంతో అక్కడ ఒక ఎర్రటి కుసుమం కలిగిన ఒక బాలుడు జన్మించాడు. భూమిపై పుట్టాడు కాబట్టి భూదేవి అతనికి ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసి ఆ తర్వాత భరద్వాజునికి అప్పగించింది.

భరద్వాజ మహర్షి ఆ కుమారునికి ఉప నయనం చేసి సకల శాస్త్రములు చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించిన ఆయన దీనిని నిష్టగా జపించాల్సిందిగా చెప్పాడు. ఈ అంగారకుడు ఆ మంత్రాన్ని నర్మదా నది తీరాన నిష్ఠగా జపిస్తే విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి నీ కోరిక ఏంటో చెప్పమన్నాడు. అంగారకుడు తన పేరుతో ఒకరోజు మంగళ దాయకంగా కావాలి అని చెప్పి అలాగే ఈ రోజున నీ పూజ చేసినటువంటి వారికి సమస్త కష్టములు తొలగి పోవాలి అని చెప్పాడు. అలాగే మూడవది దేవతల లాగా నాకు కూడా అమృతం ప్రాప్తి జరగాలని కోరుకున్నాడు. అందువల్లనే వినాయకుడు ఆయన పేరుతో ఈ రోజుని మంగళవారంగా సృష్టించడం జరిగింది. ఈరోజు మంగళవారం కావటానికి కారణం ఈ సంఘటన.

Share this post with your friends
Exit mobile version