Site icon Bhakthi TV

శివుడి కోసం పార్వతీ దేవి తలుపు వద్ద ఎదురు చూస్తూ ఉండటం వెనుక కథేంటంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో గోపేశ్వర మహాదేవ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో శివుని కోసం ఆయన గర్భగుడి వద్ద పార్వతీ దేవి ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసుకున్నాం కదా.. అసలు అలా ఎందుకు ఎదురు చూస్తోందనడానికి ఓ కథ ఉంది. ఒకసారి పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా బృందావనంలో శ్రీ కృష్ణుడి వేణు నాదం వినిపించిందట. ఆ వేణుగానికి ముగ్దుడైన శివుడు కైలాసం వీడి బృందావనానికి వెళ్లాడట. అప్పుడు శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు ఉన్నారట. శివుడిని గోపికలు లోపలికి రానివ్వకపోవడంతో ఆయన అందమైన స్త్రీ వేషం ధరించి గోపికలా మారిపోయి లోపలికి వెళ్లాడట.

పెద్ద ముక్కుపుడక, చెవులకు పోగులు ధరించి 16 అలంకారాలను శివుడు చేసుకున్నాడట. మొత్తానికి మహారాస్‌లో పాల్గొన్నాడు. ఇక పార్వతీదేవి భర్తను వెదుకుతూ ఆమె కూడా బృందావనానికి చేరుకుందట. అక్కడ శివుడు గోపికగా మారి శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడట. అది చూసిన పార్వతీదేవి మురిసిపోయిందట. లోపలికి వెళదామంటే ఆమెను రానివ్వలేదు. మగవాడిగా మారి వెళ్లాలి. అలా వెళితే ఏమవుతుందో ఏమోనని భయపడి తలుపు వద్దే ఆగిపోయిందట. గోపిక రూపంలో శివుడు నాట్యం చేశాడు కాబట్టి గోపేశ్వర ఆలయం అని దీనికి పేరు వచ్చింది. ఇక అప్పటి నుంచి పార్వతీదేవి శివుడి కోసం ఆ తలుపు వద్దే ఎదురు చూస్తూ ఉండిపోయిందట. ఇప్పటికీ ఈ ఆలయంలోని శివయ్యకు అప్పుడు ఎలా స్త్రీ మాదిరిగా తయారయ్యాడో అలాగే రాత్రి వేళ అలంకరిస్తూ ఉంటారు.

Share this post with your friends
Exit mobile version