
పూరి జగన్నాథుడి అనారోగ్యం విషయమై ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. మాధవదాస్ అనే వ్యక్తి నిత్యం జగన్నాథుడిని కొలుస్తూ ఉండేవాడు. అయితే అతని భార్య మరణం తరువాత.. తన జీవితాన్ని భగవంతుని సేవకు అంకితం చేశాడు. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యానికి గురైన మాధవదాస్‌కు జగన్నాథుడికి సేవ చేసే సత్తువ ఆయనలో లేదని ఇతర భక్తులు తేల్చేశారు. మాధవదాస్ అందుకు అంగీకరించలేదు. ఒకరోజు జగన్నాథుడికి సేవ చేస్తూ మూర్చబోవడంతో స్వయంగా భగవంతుడే ఆయనకు సేవ చేసేందుకు వచ్చాడట. మాధవదాస్ స్పృహలోకి వచ్చాక తనకు సేవ చేసేందుకు వచ్చింది జగన్నాథుడేనని అర్థం చేసుకున్నాడట.
వెంటనే జగన్నాథుడి పాదాలప పడి.. ‘నాకు నువ్వు సేవ చేయడమేంటి? నీ సేవ నుంచి నన్ను దూరం చేయకు. నీ అనుగ్రహం ఉంటే అనారోగ్యం నుంచి నను తప్పించుకోగలిగేవాడిని కదా’ అన్నాడట. అయితే విధిని తాను మార్చలేనని.. అతని విధి లిఖితంలో రాసి ఉన్న 15 రోజుల అనారోగ్యాన్ని తాను తీసుకుంటానని తెలిపాడు. అప్పట నుంచి జగన్నాథుడు తన భక్తుల అనారోగ్యాన్ని 15 రోజుల పాటు జేష్ట పౌర్ణమినాడు తీసుకుంటాడని చెబుతారు. 15 రోజుల పాటు జగన్నాథుడు అనారోగ్యంతో ఉంటాడు. ఆ 15 రోజుల పాటు ఆలయాన్ని మూసి వేస్తారు. ఆ తరువాత జగన్నాథుడ రథయాత్ర జరుగుతుంది.
