Site icon Bhakthi TV

అత్యధిక గుడులున్న రెండో రాష్ట్రం, అక్కడి ప్రముఖ ఆలయాలేంటంటే..

భారతదేశంలో ఏ గ్రామంలో చూసినా తప్పక ఆలయం ఉంటుందని తెలుసుకున్నాం. అది ఎంత కుగ్రామమైనా కనీసం గ్రామ దేవత ఆలయమైనా ఉంటుంది. ఇక భారతదేశంలో అత్యంత ఎక్కువగా దేవాలయాలున్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అని చెప్పుకున్నాం. ఇక్కడి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆలయాలు చాలా ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. మరి ఆ తరువాత దేవాలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలేంటో తెలుసుకుందాం. తమిళనాడు తర్వాత అత్యధిక దేవాలయాలున్న రాష్ట్రం మహారాష్ట్ర.

మహారాష్ట్రలో దాదాపు 77 వేల దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రసిద్ది గాంచిన ఆలయాలున్నాయి. ముంబైలో ముంబా దేవి ఆలయం, అష్ట వినాయక క్షేత్రాలున్నాయి. కొల్హాపూర్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయం, షిర్డీలో సాయినాథ్ ఆలయం, త్రయంబకేశ్వరం, భీమశంకర జ్యోతిర్లింగం, మోరేశ్వర్, శని సింగనాపూర్, గిరిజా మాత, కైలాస దేవాలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, పులేశ్వర్, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, శ్రీ మయూరేశ్వర్ వంటి దేశంలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆలయాలున్నాయి.

Share this post with your friends
Exit mobile version