Site icon Bhakthi TV

అర్థగిరి ఆంజనేయుడికి నిర్వహించే విశేష పూజలేంటంటే..

అర్థగిరి ఆంజనేయుడి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడి పుష్కరిణి గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగే విశేష పూజల గురించి తెలుసుకుందాం. పౌర్ణమిరోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్మకం. కాబట్టి ఇక్కడి ఆంజనేయుడి క్షేత్రం ప్రతి పౌర్ణమికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెలా పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. వీటిని తిలకించేందుకు విశేష పూజల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అలాగే ఇక్కడి ఆంజనేయుడికి భక్తులు ఏదైనా కోరిక కోరుకుని దానిని తీర్చమంటూ తమలపాకులు, తులసిదళములతో ఉన్న దండలు స్వామికి సమర్పిస్తారు.

ఇక్కడి క్షేత్రంతో పాటు పుష్కరిణిలు త్రేతాయుగం నాటివని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతమున్న ఆలయం చోళ రాజుల కాలంలో నిర్మించబడినదని చెబుతారు. ఈ క్షేత్ర సమీపంలో గుహలు చాలా ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ గుహల్లో యోగులు, మహర్షులు తపస్సు చేసిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడి స్వామివారితో పాటు.. పుష్కరిణిలోని నీరు సేవించేందుకు నిత్యం పెద్ద మొత్తంగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే.. తెరిచి ఉండే వేళలు.. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1-30 వరకూ.. తిరిగి 2 గంటల నుంచి 8 గంటల వరకూ తెరచి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version