Site icon Bhakthi TV

గోవు పాలతో రుద్రాభిషేకం చేస్తున్న పిల్లవాడు.. అప్పుడేం జరిగిందంటే..

వేదం చదివిన విచారశర్మ చక్కగా గోవులను సంరక్షిస్తూ ఉండేవాడు. సంతోషించిన ఆవులు.. రోజూ అతను మంచినీళ్లు తెచ్చుకున్న కుండలో పాలు విడిచి వెళ్లేవి. దీంతో ఆ బాలుడు ఆ పాలతో శివాభిషేకం చేయాలనుకున్నాడు. రుద్రం చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళుతూ.. పాలన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడనుకుని లేదంటే ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి విచారశర్మ తండ్రి యచ్చదత్తనుడికి జరిగిందంతా చెప్పాడు.

చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపటి తర్వాత కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అది చూసిన తండ్రి ఏం చేశాడో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version