
మహాభారతంలో ఆయుధాలతో పనిలేకుండా ఐదు యుద్ధాలు జరిగాయని తెలుసుకున్నాం కదా. వాటిలో మొదటిది తెలుసుకున్నాం. ఇప్పుడు సహన, నిశ్శబ్ద యుద్ధం గురించి తెలుసుకుందాం. మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాచికల ఆటలోనే కౌరవులు గెలుస్తారు,పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు. ధర్మరాజు తన సహనాన్ని,ధర్మానికి కట్టుబడి ఉండే గుణానని అత్యంత కఠినమైన పరీక్షకు నెలబెట్టాడు. మోసం జరుగుతున్నా,అవమానాలు పెనుభూతంలా వెంటాడినా, అడుగడునా నష్టం అతడిని కుంగదీసినా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు,బలవంతంగా ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు. అతని మౌనమే ఒక యుద్ధమైంది. అది స్వీయ నియంత్రణకు ప్రతి రూపం. క్షణికావేకాశాలకు లొంగకుండా, ధర్మాన్ని విడవకుండా నిలబడిన ధర్మరాజు సంయమనం నిజంగా అద్భతం. నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతలను, తొందపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియజేస్తుంది.
నిశ్శబ్ద యుద్ధం..
కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు ధుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మహాసైన్యం(నారాయణి సేన) మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగి,నిరాయుధిగా,ఎలాంటి కదలలలేని సాక్షిలా నిలబడ్డాడు. అయితే అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ధుర్యోధనుడు సంఖ్యా బలం, కండ బలంపై గుడి నమ్మకంతో మహాసైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుడిని ఎంచుకున్నాడు. నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయం కేవలం ఎంపిక మాత్రమే కాదు..అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది. ధర్మం నిజమైన బలం గుంపులో కాదు నిస్వార్థ్యమైన సత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది. కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలిస్తుందని అర్జునుడి విశ్వాపం ఆనాడే యుద్ధ ఫలితాన్ని తేల్చేసింది.
