Site icon Bhakthi TV

రామేశ్వరం వెళ్లినవారు తప్పక చూడాల్సిన ప్రదేశాలేంటంటే..

రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదు అంటుంటారు. రామేశ్వరం అనేది తమిళనాడులో ఉంటుంది. ఇదొక పవిత్ర తీర్ఘయాత్రా స్థలం మాత్రమే కాకుండా ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథ స్వామి ఆలయం ఉంటుంది. కాబట్టి దీనిని దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని నిత్యం కొన్ని వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. రామేశ్వరం వెళ్లిన వారు తప్పనిసరిగా సమీపంలోని ప్రదేశాలను చూసి వస్తారు. మరి సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రామనాథ స్వామి ఆలయం నుంచి కేవలం 3.5 కి.మీ దూరంలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. దీనిని భారతదేశానికి, శ్రీలంకకు వారధిగా కూడా పేర్కొంటారు. అదే ధనుష్కోడి. ఇక్కడ కోదండ రామస్వామి ఆలయం ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. ధనుష్కోడిలో అద్భునతమైన బీచ్ ఒకటి ఉంటుంది. అది మాత్రమే కాకుండా మన్నార్ గల్ఫ్ మెరైన్ నేషనల్ పార్క్ ఉంది. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. ఇక రామనాథ స్వామి ఆలయం నుంచి దాదాపు 6 కి.మీ దూరంలో జటాయు తీర్థాన్ని చూడవచ్చు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళుతుండగా.. జటాయువు అడ్డుకుని ప్రాణాలను కోల్పోయింది. అది ఇక్కడేనని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని జటాయువుకు అంకితం చేశారు.

Share this post with your friends
Exit mobile version