Site icon Bhakthi TV

ఈ దేవాలయంలో సినిమా షూట్ జరిగిందో పక్కా హిట్టేనట..

దేవాలయాలు ప్రతిదీ ఏదో ఒక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం.. సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ కానీ సినిమా షూటింగ్ జరిగిందో అది పక్కా హిట్టేనట. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 30 కి.మీ, శంషాబాద్ బస్ స్టాప్ నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న అమ్మపల్లిలో ఉంటుంది. ఇక్కడ శ్రీ రామ చంద్ర స్వామి కొలువుదీరాడు. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వేంగి రాజులు నిర్మించారు. ఇక్కడ శ్రీరాముడి విగ్రహం వెయ్యేళ్ల క్రితం నాటిదని చెబుతారు. ఏడు అంతస్థుల పెద్ద గోపురంతో ఆలయం ఉంటుంది.

గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద చిత్రం ఉంది. ఆలయం చుట్టూ పెద్ద కారిడార్.. మకర తోరణంతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎక్కడైనా శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు గర్భగుడిలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో పురాతనమైన కోనేరు, పరిసరాలన్నీ కొబ్బరి చెట్లతో అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఏ సినిమా చేసినా అది పక్కా హిట్ అని నమ్ముతారు. కాబట్టి టాలీవుడ్ అంతా ఈ ఆలయాన్ని అమితంగా ప్రేమిస్తుంది.

Share this post with your friends
Exit mobile version