Site icon Bhakthi TV

కొడుకు కోసం శుచిగా ఆహార పదార్థాలను వకుళ మాత వండిస్తుందట..

శ్రీ కృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకుళామాతలా వేంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనాపాలనా చూసిన వకుళామాత.. పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకుళామాతలా మారి తన పెళ్లి పెద్దగా మారి దగ్గరుండి శ్రీనివాసం పద్మావతిల కళ్యాణ వైభోగం తన చేతుల మీదుగా జరిపించింది. తిరుమల గిరులలో రెండు వకుళమాత దేవాలయాలు ఉన్నాయి.

మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర వున్న మాలాడిగుండం దగ్గర ఉంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో వున్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకు శ్రీనివాసుడికి కావలసిన ఆహార పదార్థాలను శుచిగా, శుభ్రంగా వండిస్తుంది అంటారు. శ్రీవారి నైవేద్య్యలకు సంబందించిన భాద్యతలు స్వీకరించిన అన్నపూర్ణా దేవే.. వకుళాoబ. వకుళ మాతే బంగారు తులసీపత్ర హారం (వకుళ మాల) గా మారి శ్రీవారి మెడలో చేరిందని ఒక ఐహిత్యం.

Share this post with your friends
Exit mobile version