Site icon Bhakthi TV

ప్రారంభమైన పెరటాసి మాసం.. ఎవరిని కొలుస్తారంటే..

తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసం నేడు (సోమవారం) ప్రారంభమైంది. ఈ పెరటాసి మాసం నేడు ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ పెరటాసి మాసం ప్రత్యేకత ఏంటంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అత్యంత ఇష్టమైన మాసం. కాబట్టి ఈ మాసంలో స్వామివారిని ఆరాధించుకుంటారు. పెరటాసి మాసం గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగులో 12 మాసాలకు.. తమిళంలో మాసాల పేర్లకు వ్యత్యాసం ఉంది. చాంద్రమానం ఆధారంగా తెలుగు మాసాలను లెక్కకడితే సౌరమానం ఆధారంగా తమిళ మాసాలను లెక్కకడతారు.

సూర్యుడు ఉన్న రాశిని బట్టి తమిళులు ఆయా నెలకు పేరు ఉంటుంది. ఈ లెక్కన ఆరో నెలను పెరటాసి మాసంగా తమిళులు వ్యవహరిస్తారు. దీనికి మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. అవి పురటాసి, పెరుమాళ్. పెరటాసి మాసంలోని శ్రవణ నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు.. శ్రీనివాసుడిగా అవతరించాడని చెబుతారు. వేంకటాచల మహత్యంలోనూ పెరిటాసి మాసం ప్రస్తావన ఉంది. తిరు అంటే శుభ నక్షత్రం అని అర్థం. అలా శ్రీనివాసుడి తిరు నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం రోజునే ఏడు కొండలపై శ్రీ వేంకటేశ్వర స్వామి వెలిశాడని భక్తుల నమ్మకం.

Share this post with your friends
Exit mobile version