Site icon Bhakthi TV

ఈ శివాలయ పరిధిలోని నదిలో స్నానమాచరిస్తే జరిగే అద్భుతమేంటంటే..

భారతదేవంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున శివాలయాలున్నాయి. అయితే కొన్ని శివాలయాలు చాలా ప్రత్యేకం. వాటిలో మణికరణ్ శివాలయం ఒకటి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులోని పార్వతి లోయలో వ్యాస్, పార్వతి నదుల మధ్య ఉన్న శివుడు కొలువై ఉన్నాడు. ఈ పార్వతీ నది మణికరణ్ గుండా ప్రవహిస్తుండటంతో ఈ ఆలయాన్ని మణికిరణ్ శివాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం హిందువులకే కాకుండా సిక్కులకు కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అసలు ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి? ఇక్కడ స్నానం చేస్తే జరిగే అద్బుతం ఏంటో తెలుసుకుందాం.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ పార్వతి నదికి ఒకవైపు శివాలయం ఉంటే.. మరొకవైపు మణికిరణ్ గురుద్వారా ఉంటుంది. కాబట్టి ఇది హిందువులతో పాటు సిక్కులకు కూడా పవిత్ర స్థలంగా మారింది. ఇక్కడ పార్వతీ నదిలో స్నానమాచరించిన వారికి ఎలాంటి చర్మ రోగం ఉన్న కూడా ఇట్టే మాయమవుతుందని చెబుతారు. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే.. ఇక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం పూజలు నిర్వహించారని చెబుతారు. అలాగే గురునానక్ సైతం ఈ ప్రదేశాన్ని సందర్శించాడని.. అందుకే ఇక్కడ గురుద్వారా నిర్మించారని పేర్కొంటారు.

Share this post with your friends
Exit mobile version