Site icon Bhakthi TV

‘ఓం సహనావవతు’ అంటూ సాగే ఈ శ్లోకం అర్థం ఏంటంటే..

హిందూ సంస్కృతి గొప్పదనం తెలియాలంటే… కొన్ని శ్లోకాలు తీసుకుని వాటి అర్థాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి అర్థం సరిగ్గా తెలుసుకోగలిగితే చాలు. మన సంస్కృతి గొప్పదనం తెలుస్తుంది. ఎప్పుడో సమసిపోయిన ఇప్పటి సామాజిక స్థితులకు సంబంధం లేనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని విమర్శిస్తూ కొన్ని కులాల వారిని దూషించడం విజ్ఞత కాదు. శాంతి మంత్రాలు మన ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు.

వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.

1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు,
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:

దీని అర్థం ఏంటంటే.. ‘‘సర్వ జీవులు రక్షింపబడుగాక… సర్వ జీవులు పోషింపబడు గాక… అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి (సమాజ ఉద్ధరణ కోసం )… మన మేధస్సు వృద్ది చెందుగాక… మన మధ్య విద్వేషాలు రాకుండు గాక… ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక…’’

Share this post with your friends
Exit mobile version