Site icon Bhakthi TV

బ్రిటీషర్‌ని కాపాడిన పరమేశ్వరుడు.. అసలేం జరిగిందంటే..

బ్రిటీషర్‌ని పరమేశ్వరుడు కాపాడటమేంటి? అసలేం జరిగింది అంటారా? అయితే ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే. బ్రిటీష్ కల్నల్ మార్టిన్ యుద్ధంలో పాల్గొన్న సమయంలో తన భార్యకు ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియజేసేవాడు. అయితే ఆ యుద్ధం చాలా కాలం పాటు జరగడంతో క్రమేపీ ఆయన నుంచి ఉత్తరాలు భార్యకు వెళ్లడం ఆగిపోయాయి. అప్పుడు మార్టిన్ భార్య అగర్ మాల్వా ఆందోళన చెందేది. దాని నుంచి బయటపడేందుకు గుర్రపు స్వారీ చేసేది. అలా ఒకసారి ఆమె గుర్రపు స్వారీ చేస్తూ వైద్యనాథ మహాదేవ ఆలయం దాటి వెళుతుండగా.. ఆమె చెవులకు స్వామివారికి హారతి ఇచ్చే సమయం కావడంతో మంత్రాలు, శంఖం శబ్దాలు వినిపించాయట.

వెంటనే ఆమె గుర్రం దిగి శివాలయం లోపలికి వెళ్ళిందట. ఆమె విషన్నవదనంతో కనిపించడంతో పూజారులు ఆమెను ఏమి జరిగిందని అడిగారట. తన బర్త నుంచి ఉత్తరాలు ఆగిపోయిన విషయాన్ని పూజారులకు ఆమె వివరించింది. అప్పుడు ఒక పూజారి ఆమెకు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 11 రోజుల పాటు జపించమని చెప్పాడట. శివయ్యకు మనసులో తన భర్త సురక్షితంగా తిరిగి వస్తే ఆలయం నిర్మిస్తానని మొక్కి మంత్రాన్ని జపించడం ఆరంభించిందట. 11 రోజు సాయంత్రం ఆమెకు భర్త నుంచి ఉత్తరం వచ్చిందట.

ఆ లేఖలో కల్నల్ మార్టిన్.. ఒకరోజు తమను పఠాన్లు చుట్టుముట్టారని.. తమ వద్ద ఆయుధాలు తక్కువగా ఉండటంత తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని తెలిపారు. ఇంతలో అకస్మాత్తుగా పొడవాటి జుట్టుతో, పులి చర్మం ధరించి త్రిశూలం పట్టుకున్న ఒక భారతీయ యోగి రావడం.. ఆయన్ను చూసి ఆఫ్గన్లు పారిపోవడం క్షణాల్లో జరిగిందని వివరించాడు. ఆ ఉత్తరం చదివిన వెంటనే ఆమె శివయ్యను దర్శించుకుంది. కొన్ని వారాల తర్వాత కల్నల్ మార్టిన్‌గా ఇంటికి రాగా ఆయనకు జరిగింది వివరించి ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పింది. 1883లో మార్టిన్ 15 వేలతో మహాదేవ ఆలయాన్నిపునరుద్ధరించారు. ఇప్పటికీ ఈ సమాచారం ఆలయంలోని శిలాఫలకంపై ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version