Site icon Bhakthi TV

ఆంజనేయడు కొలువైన అర్థగిరి వెనుక ఆసక్తికర కథ ఏంటంటే..

చిత్తూరు జిల్లాలో కొలువైన అర్థగిరి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడి హనుమంతుడిని ప్రసన్నాంజనేయ స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక్కడి స్వామివారి విగ్రహం ఉత్తరం వైపునకు తిరిగి ఉండటం విశేషం. ఈ అర్థగిరి క్షేత్రం గురించి ఆసక్తికరమైన కథ ఉంది. రామాయణ గాథను ఈ క్షేత్ర చరిత్రగా చెబుతారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణాసురుడు ఎత్తుకెళ్లిన తర్వాత ఆంజనేయుడు ఆమె జాడ తెలుసుకుని శ్రీరాముడికి చెబుతాడు. అప్పుడు రావణుడి చెర నుంచి సీతమ్మను విడిపించేందుకు రావణుడితో రాముడు యుద్ధం చేస్తాడు.

ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చబోతాడు. అప్పుడు లక్ష్మణుడు తిరిగి కళ్లు తెరవాలంటే సంజీవని కావాలని చెబుతారు. ఈ క్రమంలోనే హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి వెళతాడు. అయితే సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక ఏకంగా పర్వతాన్నే పెకలించుకుని తీసుకు వస్తాడు. అప్పుడు ఔషదులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశాడట. చీకటి సమయం కావడంతో రాక్షసులు తమకు హాని తలపెట్టేందుకు పర్వతాన్ని తీసుకొస్తున్నారని భావించి హనుమంతునిపైకి భరతుడు బాణం వేశాడట. అప్పుడు పర్వతంలో సగభాగం విరిగి నేలపై పడిందట. అలా పడిన ప్రాంతమే అర్థగిరిగా చెబుతారు.

Share this post with your friends
Exit mobile version