Site icon Bhakthi TV

ఇక్కడి కాల భైరవుడు హాయిగా మద్యం స్వీకరిస్తాడు..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన కాలభైరవుని గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ కాలబైరవుని విగ్రహం మద్యం సేవిస్తుందని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఒక విగ్రహానికి ఆకలిదప్పులు ఉండవు. కానీ ఉజ్జయినిలో కొలువైన ఈ కాలభైరవుని విగ్రహం మద్యం సేవిస్తుంది. వాస్తవానికి ద్రవ పదార్థాలు స్వీకరించినప్పుడు అన్ని రకాల ద్రవ పదార్థాలు స్వీకరించాలి కదా.. కానీ ఈ విగ్రహం మాత్రం కేవలం మద్యమే స్వీకరిస్తుంది. దీనిని ప్రత్యక్షంగా చూశామని కూడా కొందరు భక్తులు చెబుతున్నారు.

ఉజ్జయిని… మహాశివుని ద్వాదశ జ్యోతిర్లంగాలలో ఒకటైన మహాకాళేశ్వరుడు కొలువైన దేవాలయాల నగరం. ఇక్కడి నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో మహాకాళేశ్వరుని దేవాలయం ఉంటుంది. దీనిలోనే కాలభైరవుని ఆలయం కూడా ఉంటుంది. ఏ ఆలయం వద్దైనా పూజా సామానుల షాపులు ముందుగా మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ ఆలయంలో మాత్రం పూజా ద్రవ్యాలు, పుష్పాలతో పాటు మద్యం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లిన వారంతా పూజా ద్రవ్యాలతో పాటు మద్యాన్ని కూడా స్వామివారి కోసం కొనుగోలు చేసి తీసుకెళతారు. కాలభైరవునికి మద్యం సమర్పిస్తే చక్కగా సేవిస్తాడట.

Share this post with your friends
Exit mobile version