Site icon Bhakthi TV

ఈ ఆలయంలోని స్వామివారి రూపం తిరుమల శ్రీనివాసునికి దగ్గరగా ఉంటుందట..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పోలిన స్వామి మరెక్కడైనా ఉంటాడా? అంటే తమిళనాడులోని మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అళగర్ కోవెలలో స్వామివారు ఉంటారు. అందుకే దీనిని దక్షిణ తిరుపతి అని కూడా అంటారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108 దివ్య క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. దట్టమైన చెట్టు, కొండ పక్కన ఈ క్షేత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిలోని మూలమూర్తిని తిరుమాళ్‌గా భక్తులంతా కొలుచుకుంటూ ఉంటారు. మధుర మీనాక్షి ఆలయానికి వెళ్లిన వారు ఈ ఆలయం గురించి తెలిసి ఉంటే తప్పక వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.

తిరుమాళ్ స్వామివారిని మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామి సోదరుడని అంటారు. ఈ క్రమంలోనే మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవానికి తిరుమాళ్ స్వామివారి ఉత్సవ విగ్రహం వెళుతుందట. పెరుమాళ్ స్వామివారి రూపం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని పోలి ఉంటుందట. ఈ ఆలయం ఈనాటిది కాదట. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటిదని తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పాధికారం ద్వారా తెలుస్తోంది. ఆలయం చుట్టూ గోడలన్నీ శిథిలయమయ్యాయి. ఆలయ గోపురం వచ్చేసి దాదాపు 180 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపురంపై బంగారు పోత నిత్యం సూర్యకాంతికి మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version