Site icon Bhakthi TV

ఇక్కడి స్వామివారి కళ్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి..

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సింగోటం అనే ప్రాంతంలో నరసింహస్వామి లింగ రూపంలో కొలువుదీరాడని తెలుసుకున్నాం కదా. స్వామివారు రాజుకు కలలో కనిపించి తన ఆనవాళ్లు చెప్పిన సంగతి కూడా చెప్పుకున్నాం. అయితే లింగరూపంలో ఉన్న ఒక శిల కాంతులీనుతూ సింగమనాయుడికి కనిపించింది. వెంటనే దానిని గ్రామంలోకి తీసుకొచ్చాడట. ప్రస్తుతం ఆలయం వున్న వెనక ఎత్తైన బండ దగ్గరకి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నృసింహుడినని చెప్పాడట. అక్కడి స్వామి ప్రతిమని పెట్టారట.

అందుకే దీనికి ‘పాదం గుడి’ అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి వారి పాదం గుర్తులు మనకు కనిపిస్తాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వామికి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆ తరువాత లక్ష్మీనరసింహ స్వామివారికికి ఎండ తగలకుండా ఉండటానికి మొదట్లో నాపరాయితో చిన్న గుడి నిర్మించారు. గర్భగుడి నేటికీ అలాగే ఉంది. ఒక కన్ను కిందకు, ఒక కన్ను మీదకు, ఎగుడు దిగుడుగా ఇక్కడి స్వామివారి కళ్లు ఉండటం విశేషం. ఎడమ కన్ను కింద భాగంలో కమలం ఉంటుంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడు అన్నారు. ఈ కొండకు శ్వేతాద్రి అని పేరు. అలాగే ఇక్కడ ఆంజనేయస్వామిని సైతం ప్రతిష్టించారు.

Share this post with your friends
Exit mobile version