Site icon Bhakthi TV

శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలి గ్రంథమేంటంటే…

శ్రీకృష్ణావతారం నారాయణుడి పరిపూర్ణావతారంగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా భక్తులు ఆరాధించేది శ్రీకృష్ణుడినే! శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఛాందోగ్యోపనిషత్తు. సామవేదానికి చెందిన ఈ ఉపనిషత్తు క్రీస్తుపూర్వం 8–6 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు చెబుతారు. ఛాందోగ్యోపనిషత్తులో శ్రీకృష్ణుని ప్రస్తావన, ధృతరాష్ట్రుడి ప్రస్తావన కనిపిస్తాయి. మెగస్తనీస్‌ తన రచనల్లో మధురలోని శూరసేనుడనే రాజు ‘హెరాకిల్స్‌’ను పూజించేవాడని రాశాడు. హెలియోడోరస్‌ శ్రీకృష్ణ భక్తుడిగా మారి, భాగవత ధర్మాన్ని అవలంబించాడు. అతడు మధ్యప్రదేశ్‌లోని విదిశా (ఇదివరకటి బేస్‌నగర్‌) నగరంలో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించి, దానిపై ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభుభక్తుడు హెరిడోరస్‌’ అని శిలాశాసనం వేయించాడు.

శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలి గ్రంథమేంటంటే…

దాదాపు ఇదే కాలానికి చెందిన మరో శాసనం మధుర సమీపంలోని మోరాలో ఉంది. ఇందులో వృష్టి వంశానికి చెందిన ఐదుగురు వీరుల ప్రస్తావన ఉంది. అందులో ప్రస్తావించిన ఐదుగురు వీరులు: బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు. ‘కృష్‌’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నల్లని’ అనే అర్థం ఏర్పడింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. శ్రీకృష్ణ భక్తుడైన చైతన్యప్రభు గౌడీయ వైష్ణవ తత్వానికి ప్రాచుర్యం కల్పించాడు. ‘హరేకృష్ణ’ నామాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చాడు. చైతన్యప్రభు బోధలతో గౌడీయ వైష్ణవంలోని కృష్ణతత్వం, ‘హరేకృష్ణ’ భక్తి ఉద్యమం దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది.

శ్రీల ప్రభుపాదగా ప్రసిద్ధి పొందిన అభయచరణారవింద భక్తివేదాంత స్వామి తాను నెలకొల్పిన ‘ఇస్కాన్‌’పశ్చిమబెంగాల్‌లోని ‘ఇస్కాన్‌’ ప్రధానకేంద్రమైన మాయాపూర్‌లో ‘చంద్రోదయ మందిరం’ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే, కంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ ఆలయం తర్వాత అతి పెద్ద ఆలయం ఇదే కానుంది. దీని నిర్మాణానికి 75 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుండగా, ఇందులో సింహభాగం ‘ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ’ వ్యవస్థాపకుడైన హెన్రీఫోర్డ్‌ మునిమనవడు ఆల్ఫ్రెడ్‌ బీ ఫోర్డ్‌ ఖర్చు చేస్తున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమానికి ఆకర్షితుడైన ఆయన ‘ఇస్కాన్‌’లో చేరారు. అంబరీష్‌ దాస్‌గా వైష్ణవనామాన్ని స్వీకరించి, ప్రస్తుతం ‘ఇస్కాన్‌’ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version