Site icon Bhakthi TV

శ్రీనివాసుడి మాటలకు ఏమాత్రం తలొగ్గని అగస్త్యుని శిష్యులు..

శ్రీ మహాలక్ష్మిని వెదుక్కుంటూ శ్రీనివాసుడు భూమి మీదకు వచ్చాడు. భూమి మీద అడుగు పెట్టగానే మానవుడి మాదిరిగానే ఆయనకు కూడా ఆకలిదప్పులు మొదలయ్యాయి. అగస్త్యుని వద్దకు వెళ్లి తనకు గోవు పాల కోసం ఆయన ఆశ్రమంలోని ఒక గోవుని ఇవ్వమని కోరాడు. శ్రీ మహాలక్ష్మితో వస్తేనే గోవుని ఇస్తానని అగస్త్యుడు కండీషన్ పెట్టాడు. అప్పుడు శ్రీనివాసుడు మీరు కోరిన విధంగానే సతీసమేతంగా వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత పద్మావతిని శ్రీనివాసుడు వివాహమాడాడు. అనంతరం పద్మావతితో కలిసి అగస్త్యుని ఆశ్రమానికి శ్రీనివాసుడు వచ్చాడు. అయితే అప్పుడు ఆశ్రమంలో అగస్త్యుడు లేడు.

మహర్షి శిష్యులు మాత్రం ఉన్నారు. వారు సతీసమేతంగా వచ్చిన శ్రీనివాసుడిని చూడగానే.. మీరు ఎవరని ప్రశ్నించారు. తామెలా సాయం చేయగలమో అడిగారు. అప్పుడు శ్రీనివాసుడు తన సతీమణి పద్మావతీదేవిని పరిచయం చేసి జరిగిందంతా చెప్పారు. అప్పుడు అగస్త్యుని శిష్యులు.. శ్రీనివాసుడికి నమస్కరించి తమ గురువుగారు ఆశ్రమంలో లేరని.. తరువాత రావాలని చెప్పారు. తాను లోకాన్ని సంరక్షించేవాడినని.. తాను చెబుతన్నది అక్షర సత్యమని.. తనను నమ్మాలని తెలిపాడు. అంతేకాదు.. మీ గురువుపై గౌరవంతో తనకు గోవును ఇవ్వాలని తెలిపాడు. అప్పుడు శిష్యులు తమ గురువుగారి మాటకు విలువిస్తామని.. కానీ అనుమతి లేకుండా ఏదీ చేయలేమని తెలిపారు. సరేనన్న శ్రీనివాసుడు తన భార్యతో కలిసి ఆశ్రమానికి వచ్చానని అగస్త్యుల వారికి చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version