Site icon Bhakthi TV

ఈ చెరువులో నీరు, ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుందనేదే పెద్ద మిస్టరీ

మధ్యప్రదేశ్‌లోని అచ్రు మాత ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. నివారి జిల్లాలోని పృథ్వీపూర్ తహసీల్ ప్రాంతంలోని గ్రామ పంచాయితీ మడియాలో ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారిని పశువుల కాపరి పేరు మీదుగా అచ్రు మాత అని భక్తులు పిలుస్తారు. అయితే వేసవి కాలంలో మధ్యప్రదేశ్ మొత్తం కరువు సంభవించినా కూడా అచ్రుమాత ఆలయంలోని చెరువులో మాత్రం నీరు ఎండిపోదట. పైగా చెరువు వద్దకు వచ్చిన వారికి అమ్మవారు ప్రసాదం ఇస్తుందని చెప్పుకున్నాం కదా.. అదెక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదట.

ఆలయం చెరువులోని నీరు, ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ దానిని ఎవరూ కనుగొనలేకపోయారు. అయితే దీనిని సతీదేవి కన్నీళ్లు పడిన ప్రదేశంగా చెబుతారు. దక్ష ప్రజాపతి తన యాగం చేసినప్పుడు శివుడిని అవమానించినప్పడు సతీదేవి కళ్ల నుంచి నీళ్లు కింద పడి చెరువుగా మారిందని చెబుతారు. ఈ చెరువులోని నీరు ఎర్రగా ఉంటుంది. దీనికి కూడా ఓ కారణాన్ని స్థానికులు చెబుతారు. ఒకసారి ఈ చెరువు పరిసరాలను శుభ్రం చేస్తున్నప్పుడు.. చెరువు ముఖద్వారం వద్ద ఉన్న నాచును గుర్తించారట. దానిని ఇనుప గొడ్డలితో కొట్టి శుభ్రం చేయడానికి యత్నించగా చెరువు నీరు ధ్వంసమై రక్తంలా ఎర్రగా మారిపోయిందని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version