Site icon Bhakthi TV

ప్రారంభమైన తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి సాయంత్రం శేష వాహనంపై స్వామివారు విహరించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకూ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న (మంగళవారం)‌ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 26వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

22-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – హనుమంత వాహనం

23-05-2024
ఉదయం – ద్వార దర్శనం
సాయంత్రం – గరుడ వాహ‌నం

24-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – హంస వాహనం

25-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – విమాన వాహనం

26-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
సాయంత్రం – మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

27-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – తిరుచ్చి ఉత్సవం

28-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – పార్వేట ఉత్సవం

29-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం

30-05-2024
ఉదయం – అభిషేకం
సాయంత్రం – పుష్పయాగం

Share this post with your friends
Exit mobile version