Site icon Bhakthi TV

మనిషిలోని చెడు గుణాలే 22 మెట్లు.. తీర్థంకరులకు సూచనలు..

పూరి జగన్నాథుడి ఆలయంలోని 22 మెట్లు మనిషిలోని చెడు గుణాలకు సంకేతాలని హిందువులు నమ్మితే.. జైన మతస్థులు మాత్రం 22 తీర్థంకరులను సూచిస్తాయని చెబుతారు. ఈ 22 మెట్లను దాటడం ద్వారా మనిషిలోని చెడు గుణాలన్నింటినీ దాటి జగన్నాథుని దర్శించుకోవచ్చని చెబుతారు. ఈ 22 మెట్లు 18 పురాణాలు, నాలుగు వేదాలను సూచిస్తాయని సైతం కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది మాత్రం 14 భువనాలు, ఎనిమిది వైకుంఠాలకు చిహ్నంగా భావిస్తారు. ఈ 22 మెట్లకు ఇంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టే వీటిని దాటిన తర్వాత భక్తులు జగన్నాథుడిని దర్శనం చేసుకుంటారు.

అలాగే ఈ మెట్ల గురించి మరో అభిప్రాయం ఏంటంటే.. జగన్నాథుని చెక్క విగ్రహం రూపొందించేందుకు 21 రోజులు పట్టిందట. కాబట్టి ఈ మెట్లు అదే సూచిస్తాయట. 22 వ మెట్టును దాటితే భగవంతుడిని దర్శించుకోవచ్చట. జైన మతస్థులు అయితే జగన్నాథుడిని సందర్శించుకునేందుకు వస్తే తల దించుకుని మెట్లు ఎక్కుతారు. ఆలయంలోని 22 మెట్లు ఐదు మంత్రాలు, పంచ భూతాలు, ఐదు విత్తనాలు, ఐదు దేవతలు, జీవుడు, పరమాత్మలని కొందరి విశ్వాసం. ఆరవ మెట్టు నుంచి పదవ మెట్టు వరకూ మన ఐదు ముఖ్యమైన శ్వాసలని.. 11 నుంచి 15.. మన రూపం, సారాంశం, వాసన, రుచి, శబ్దం.. 16 నుంచి 20వ మెట్లు ఆకాశం, నీరు, అగ్ని, భూమి, గాలి.. 21వ మెట్టు ఉగ్ర అంటే జ్ఞానం.. 22వ మెట్టు ఖయోబిని అని పేరు పెట్టారు.

Share this post with your friends
Exit mobile version